''హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టెలివిజన్ 2018'' లిస్ట్ కి సంబంధించిన సెకండ్ ఎడిషన్ ని తాజాగా విడుదల చేశారు. దీనిలో సీరియల్ నటి భూమి శెట్టి అగ్ర స్థానంలో నిలిచింది. ఆమె 'నిన్నే పెళ్లాడుతా' అనే సీరియల్ లో మృదులగా అందరికీ సుపరిచితురాలే.. 

ప్రదీప్ హోస్ట్ చేసిన 'పెళ్లిచూపులు' ప్రోగ్రాంలో విన్నర్ గా నిలిచిన జ్ఞానేశ్వరి మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత మూడో స్థానంలో ఢీ యాంకర్ వర్షిణి నిలవగా.. యాంకర్ రష్మి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

యాంకర్ విష్ణుప్రియ ఐదో స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా వెళ్లిన దీప్తి సునైనాకి సైతం ఈ లిస్ట్ లో చోటు దక్కింది. అంతేకాదు.. ఈమె తరువాతి స్థానాల్లో హాట్ యాంకర్ శ్రీముఖి, అనసూయ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

సునైనాకి ఈ లిస్ట్ లో 11వ స్థానం దక్కగా.. యాంకర్ శ్రీముఖి 12వ స్థానంలో, యాంకర్ అనసూయ 13వ స్థానంలో నిలిచారు. మొత్తంగా 15మంది ఈ లిస్ట్ లో ఉండగా.. అందులో 5 స్థానాలు బుల్లితెర యాంకర్లే దక్కించుకున్నారు.