బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగ్స్ కి బాగా ఫేమస్. బాలయ్య డైలాగ్ చెవితే విజిల్స్ వేయాల్సింది. బాలయ్యను మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గిర చేసిన అంశాలలో డైలాగ్స్ కూడా ఒకటి. కాగా బాలయ్య చెప్పిన ఓ ఫేమస్ డైలాగ్ పోలీసులు ఓ మంచి కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగ్ ని కొంచెం మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

విషయంలోకి వెళితే ప్రతిరోజూ రహదారులపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం సేవించడం వలన జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపి అనేక మంది ప్రమాదాలకు గురి కావడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీనిపై అవగాహనా కోసం బాలయ్య సూపర్ హిట్ మూవీ సింహ లోని డైలాగ్ ని వాడేస్తున్నారు. 

సింహ మూవీలో ఓ యాక్షన్ సన్నివేశంలో 'నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు' అని బాలయ్య చెప్పిన  డైలాగ్ సూపర్ ఫేమస్. ఈ డైలాగ్ ని కొంచెం మార్చి 'పండగలని, పబ్బాలని, సెలవలని తాగి బండి నడిపితే నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు...' అనే డైలాగ్ బాలయ్య ఫొటోతో పాటు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి విశేష స్పందన దక్కుతుంది.