నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఓ వెబ్ సీరిస్ పై హైదరాబాద్ కు చెందిన కోర్టు స్టే విధించింది. ఆ వెబ్ సీరిస్ పై కోర్ట్ కు వెళ్లింది సత్యం రామలింగరాజు కావటం విశేషం. ఆయన హైదరాబాద్ సివిల్ కోర్ట్ లో  ఆ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ ఆపమంటూ పిటీషన్ వేసారు. కోర్టు  వివరాలను పరీశీలించి స్టే ఆర్డర్ ఇచ్చింది. తన ప్రైవసీని ఆ వెబ్ సీరిస్ భంగపరుస్తుందని, నిజాలు సగమే చెప్తోందని, అది తన గౌరవానికి భంగం కలగచేస్తోందని ఆయన ఆరోపిస్తూ పిటీషన్ వేసారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఆ వెబ్ సీరిస్ కు సంభందించిన ట్రైలర్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ సీరిస్ పేరు  ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’.

`బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’ సిరీస్‌లో భారత్‌కు చెందిన అత్యంత ‘అప్రతిష్ట’ బిలియనీర్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రత రాయ్, బైర్రాజు రామలింగరాజు తదితర వాణిజ్య దిగ్గజాల ఉత్థాన పతనాల ఆధారంగా కథనాల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కాగా, వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

మరో ప్రక్క ఇప్పటికే   ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్‌’కు వ్యతిరేకంగా మెహుల్‌ చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీరూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. చోక్సీ దేశం విడిచి పారిపోగా 2018 జనవరి 15న ఆంటిగ్వా బార్బుడా పౌరసత్వం లభించింది. ‘  ఈ కేసు త్వరలోనే విచారణకు రానుంది.

విచారణ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తరఫున న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తన వాదన వినిపించారు. ఓటీటీ‌లోని విషయాలను ఎవరూ నియంత్రించలేరని అన్నారు. దీనిని నీరవ్ మోదీపై డాక్యుమెంటరీ సిరీస్‌గా పేర్కొంటూ, నీరవ్ మోదీ తన మేనమామతో కలిసి పనిచేయడం, రాయిటర్స్, బీబీసీ సహా న్యూస్‌ ఛానెల్స్‌కు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు చూపించడం జరిగిందని, పబ్లిక్ డొమైన్‌లో ఇవి ఇప్పటికే ప్రసారమయ్యాయని అన్నారు.