Asianet News TeluguAsianet News Telugu

కమెడియన్ చిచ్చా చార్లెస్ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

సోషల్ మీడియాలో తెలుగు సాంగ్స్, వీడియోలతో పాపులర్ అయ్యాడు చిచ్చా చార్లెస్. చిచ్చా చార్లెస్ ఆఫ్రికాలోని యుగాండా దేశస్తుడు. 2017లో చిచ్చా చార్లెస్ ఉన్నత చదువుల కోసం ఇండియా వచ్చాడు. 

Hyderabad cops arrests comedian Chicha charles
Author
Hyderabad, First Published Dec 2, 2021, 6:03 PM IST

సోషల్ మీడియాలో తెలుగు సాంగ్స్, వీడియోలతో పాపులర్ అయ్యాడు చిచ్చా చార్లెస్. చిచ్చా చార్లెస్ ఆఫ్రికాలోని యుగాండా దేశస్తుడు. 2017లో చిచ్చా చార్లెస్ ఉన్నత చదువుల కోసం ఇండియా వచ్చాడు. వరంగల్ లోని ఓ కాలేజీలో చిచ్చా బీఫార్మసీ చేస్తున్నాడు. ఈ ఏడాదితో చిచ్చా చదువు పూర్తి కానుంది. 

Chicha Charles ఈ నాలుగేళ్లలో తెలుగు పాటలు, మాటలతో సోషల్ మీడియాలో బాగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలతో కూడా చిచ్చా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఇక తరచుగా చిచ్చా చార్లెస్ జబర్దస్త్ కమెడియన్లతో కలసి రచ్చ చేస్తుంటాడు. 

ఇదిలా ఉండాలా చిచ్చా చార్లెస్ ని హైదరాబాద్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసిన విదేశీయులని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చిచ్చా చార్లెస్ కూడా ఉన్నాడు. చిచ్చా చార్లెస్ వీసా గడువు రెండేళ్ల క్రితమే ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. 

చిచ్చా చార్లెస్ తో పాటు వీసా గడువు ముగిసిన 50 మంది నైజీరియన్లని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ తల్లిదండ్రుల కోరిక మేరకే తాను ఇండియాకు చదువు కోసం వచ్చినట్లు చిచ్చా చార్లెస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన తల్లి బిజినెస్ వుమెన్ కావడంతో అప్పుడప్పుడూ ఇండియా వస్తూ ఉంటుంది అని చిచ్చా పేర్కొన్నాడు. 

ఈ నాలుగేళ్లలో చిచ్చా పర్వాలేదనిపించే విధంగా తెలుగు నేర్చుకున్నాడు. కొన్ని జానపద గీతాల్ని కూడా చిచ్చా ముద్దు ముద్దుగా పాడగలడు. ఇంస్టాగ్రామ్ లో తెలుగు వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటున్నాడు. చెట్టు కింద కుర్చున్నావమ్మా అంటూ సెజ్ మంగ్లీ పాటలో సైతం చిచ్చా మెరిశాడు. 

Also Read: Omicron: ఓ మైగాడ్.. 'ఒమిక్రాన్' వల్ల భూమి స్మశానంగా మారుతుందా, వణుకు పుట్టిస్తున్న ఆర్జీవీ పోస్ట్

Follow Us:
Download App:
  • android
  • ios