Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ ‘పఠాన్’కు భారీ రెస్పాన్స్.. రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్స్!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించి ‘పఠాన్’ చిత్రం రేపు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో రికార్డు స్థాయిలో టికెట్లు  అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. 
 

Huge response to Pathaan movie tickets advance bookings!
Author
First Published Jan 24, 2023, 4:03 PM IST

కింగ్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘పఠాన్’ (Pathaan). చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. షారూఖ్ ఖాన్ కు జోడీగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. మరో ప్రధాన ప్రాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటిస్తున్నారు. సినిమాకు ఆనంద్ కథ అందించగగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు.  ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. 

రేపే (జనవరి 25) ఇండియా వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఐమాక్స్ వెర్షన్ లో చిత్రాన్ని రిపబ్లిక్ డేకు ముందు రోజు విడుదల చేస్తున్నారు. హిందీతోపాటు తెలుగులోనూ గ్రాండ్ విడుదలకు ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ బుక్కింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. రికార్డు స్థాయిలో అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. కేవలం బుక్ మై షోలోనే 10 లక్షలకు పైగా టికెట్లుు  అమ్ముడైనట్టు సమాచారం.  ఈ విషయాన్ని బుక్ మై షో సీవోవో ఆశిష్ సక్సెనా తెలిపారు. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి ‘పఠాన్’ చిత్రం రాబోతుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారని తెలిపారు. దాని ప్రభావమే ఎక్కువ మొత్తం టికెట్స్ బుకింగ్ అవుతున్నాయని అన్నారు. 

కేవలం నిన్న (సోమవారం) ఒక్కరోజే ‘పఠాన్’ మూవీకి ఐనాక్స్ సినిమాస్ లో 2.75 లక్షల టికెట్లు బుక్ అయినట్టు ఐనాక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేయడం విశేషం. 2023లో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతుండటం, ఇప్పటికే అంచనాలు పెంచేయడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు చిత్రంపై వ్యతిరేకతలు వస్తున్నా.. ప్రేక్షకులకు మాత్రం  టికెట్స్ బుకింగ్ చేసుకుంటూ సినిమాపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios