భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ ఫిల్మ్ "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. అయితే నిన్న రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ కు తెలుగులో భారీ రెస్పాన్స్ వస్తోంది.
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్ కపూర్, అలియాభట్ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున (Nagarjuna), మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్.
ఈ భారీ చిత్రం తెలుగులో "బ్రహ్మస్త్రం" పేరుతో రిలీజ్ కానుంది. నిన్ననే ఈ చిత్ర ట్రైలర్ ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. రన్బీర్ కపూర్ అద్భుత మైన నటనకు ట్రైలర్ యాత్రం యూట్యూబ్ లో దూసుకెళ్లోంది. ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. ఒక రోజు గడవకముందే దాదాపుగా 6 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. అంటే 60 లక్షల మంది వీక్షించారు. ఇంకా ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ట్రైలర్ కు వస్తున్న స్పందనతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అటు రాజమౌళికి సినిమాను సమర్పిస్తుండటం.. బాలీవుడ్ స్టార్స్ రన్బీర్ కపూర్ తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో సినిమాకు మరింత రీచ్ పెరుగుతోంది.
ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం.. మొదటి భాగం `బ్రహ్మాస్త్ర’ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేశారు మేకర్స్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
