ఒక ప్రక్క వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అభిమానులు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక వద్దకు పోటెత్తారు. తిరుపతి నగరం జన సంద్రంగా మారిపోయింది.
ప్రభాస్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధమైంది. తిరుపతి వేదికగా నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివస్తున్నారు. ఒక ప్రక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా వేడుకకు హాజరవుతున్నారు. యువకులు, యువతులు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు... ఇలా అన్ని వర్గాల వారు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగమయ్యారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు.
కాషాయ జెండాలు చేతపట్టి, టీషర్ట్ ధరించి పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. వేదిక పరిసరాల ప్రాంతాలు కాషాయమయం అయ్యాయి. ప్రభాస్ ఫస్ట్ టైం నటించిన రామాయణగాథ ఆదిపురుష్ మూవీపై ఎంత హైప్ ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఆదిపురుష్ ప్రభాస్ గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తుంది.
గత ఏడాది విడుదలైన ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది. దీంతో చిత్ర విడుదల ఆరు నెలలు వాయిదా వేశారు. నిజానికి 2023 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. జూన్ 16కి వాయిదా వేశారు. ఈ వ్యవధిలో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ అప్పటి వరకు ఉన్న అపోహలను తొలగించేసింది. ఆదిపురుష్ ట్రైలర్ కి అద్భుత రెస్పాన్స్ దక్కింది.
ఆదిపురుష్ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మూవీపై ఉన్న హైప్ ఏమిటో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించారు. ప్రధాన విలన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది.

