మహేష్, చరణ్ రేంజ్ లో విజయ్ దేవరకొండ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 12:50 PM IST
huge quote for vijay devarakonda's nota movie telugu rights
Highlights

'అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.

'అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా విడుదలైన మూడు వారల తరువాత కూడా నిన్నటి శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 లక్షల షేర్ వసూలు చేసింది.

నిన్న దాదాపు అరడజను సినిమాలు విడుదలయ్యాయి. అయినా గీత గోవిందం మాత్రం తన హవా సాగిస్తూనే ఉంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. అతడు నటించిన 'నోటా' సినిమాను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు.

వారు రూ.20 నుండి రూ.25 కోట్లు కోట్ చేస్తుంటే చిత్ర దర్శకనిర్మాతలు మాత్రం రూ.30 కోట్లకు తక్కువ ఇవ్వకూడదని ఫిక్స్ అయి ఉన్నారట. నిజానికి రూ.30 కోట్ల బిజినెస్ అంటే టాప్ హీరోల సినిమా కింద లెక్క. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు నలభై కోట్లలో అమ్మారు. అలాంటిది విజయ్ సినిమా ముప్పై కోట్లంటే అతడు టాప్ హీరోల రేంజ్ కి వెళ్లిపోయాడనే చెప్పాలి. ఇలానే విజయ్ సక్సెస్ బాట పడితే టాప్ ఫైవ్ లో చేరడం ఖాయం. 

loader