సూపర్ స్టార్ మహేష్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతుంది.
సర్కారు వారి పాట మూవీ మరో నాలుగు వారాల్లో థియేటర్స్ లో దిగనుంది. ఈ నేపథ్యంలో మూవీ హక్కులు విక్రయం మొదలైంది. వరుస హిట్స్ తో ఊపుమీడుతున్న మహేష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే స్థాయిలో థియరిటికల్ హక్కులకు డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా థియేట్రికల్ హక్కులను జీఎస్టీతో కలిపి నైజాం ఏరియాలో రూ.30- 35 కోట్ల రూపాయలకు కోనుగోలు చేశారట. అలాగే ఆంధ్ర ఏరియాలో రూ.50-60 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ విపిస్తోంది.
అయితే మహేష్ (Mahesh babu) మూవీకి ఇంత మొత్తంలో చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడంపై పెద్ద చర్చే జరిగిందట. సినిమా ఏదైనా తేడా కొడితే ఎలా అని కూడా డిస్ట్రిబ్యూటర్స్ మేకర్స్‌ను ప్రశ్నించారు. అయితే సినిమా బాగా వచ్చిందని, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చిన తాము అండగా ఉంటామని డిస్ట్రిబ్యూటర్స్‌కి మేకర్స్ భరోసా ఇవ్వడంతో వాళ్లు అధిక మొత్తంలో థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే తెలుగుతో పాటు తమిళంలో కూడా సర్కారు వారి పాట చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ రైట్స్ పది కోట్లకు పైనే అమ్ముడు పోయే అవకాశం కలదు. ఇక మహేష్ ఓవర్ సీస్ కింగ్ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా సర్కారు వారి పాట రూ. 150 నుండి 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం కలదు. ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో టార్గెట్ రీచ్ కావడం మహేష్ కి అంత కష్టమైన పనేమీ కాదు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన రెండు సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి.
