Asianet News TeluguAsianet News Telugu

# Nani ‘సరిపోదా శనివారం’బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్, ఎంత లాభం?

 ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం దాదాపు పూర్తైందని సమాచారం. నిర్మాత మంచి లాభాల్లో ఉన్నారని, సేఫ్ జోన్ లోకి వచ్చేసారని టాక్.
 

Huge Pre Release Business for Nani Vivek Athreya Pan India Film #SaripodhaSanivaaram jsp
Author
First Published Jan 30, 2024, 8:24 AM IST

నానితో ‘అంటే సుందరానికి’ లాంటి  కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని మరో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవటంతో మరో సినమా దక్కింది.  దాంతో  దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నాని 31వ సినిమా  ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) కమిటయ్యారు.  ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం దాదాపు పూర్తైందని సమాచారం. నిర్మాత మంచి లాభాల్లో ఉన్నారని, సేఫ్ జోన్ లోకి వచ్చేసారని టాక్.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 80Cr+ బడ్జెట్ తో నిర్మాణమవుతోంది. ఈ సినిమా నిర్మాత భారీగా థియేట్రికల్ బిజినెస్ ... , నాన్ థియేట్రికల్ బిజినెస్ ...జరిగింది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని అదిరిపోయే రేటుకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. అలాగే థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు భారీ మొత్తానికే తీసుకున్నారు. శాటిలైట్ మిగతా రైట్స్ బిజినెస్ ఫైనల్ స్టేజిలో డిస్కషన్స్ లో ఉంది.  

ఓవరాల్ గా ఈ చిత్రం బిజినెస్ 100 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. దాంతో  నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే. ఇరవై కోట్లు మినిమం ప్రాఫెట్ ఉంటుందని చెప్తున్నారు. దసరా సూపర్ హిట్ అవటం, హాయ్ నాన్న చిత్రం యావరేజ్ అనిపించుకున్నా కలెక్షన్స్ బాగుండటం,ఓటిటిలో బాగా వెళ్లటంతో ఈ రేట్లు పలికినట్లు సమాచారం. 
  
ఇక  ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ సినిమా కాకుండా దసరా లాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ యాక్షన్ ఇమేజ్ ని మించి నాని తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్ ఆత్రేయ.   'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ తీసిన ప్రతి సినిమాకు వెరైటీ కాన్సెప్టు ని ఎంచుకుంటున్నారు. 

'సరిపోదా శనివారం' సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి కూడా ఆయనే నిర్మాత. ఇక, 'సరిపోదా శనివారం' విషయానికి వస్తే... ఈ సినిమాలో  హీరోయిన్ గా ప్రియాంకా అరుల్ మోహన్ ఎంపిక అయ్యారు. దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఓ నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది. 
 
ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది నాని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం.  ఈ విషయమై నాని క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ... ఆగస్ట్ 2024కు ఈ చిత్రం రిలీజ్ కు రెడీ చేస్తామని  చెప్పుకొచ్చారు. కథ, పాత్ర డిమాండ్ మేరకు మేకోవర్ కూడా అవుతున్నారు. ‘సరిపోదా శనివారం’లో రగ్డ్ లుక్‌లో నాని కనిపించనున్నారు. 

‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘దసరా’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్, రగ్డ్ మూవీ తర్వాత.. ‘హాయ్ నాన్న’ అనే క్లాస్, ఫీల్ గుడ్ స్టోరీని నాని ఎంచుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios