ఆల్ టైం రికార్డ్ రేటు పలికిన అరవింద సమేత కర్నాటక రైట్స్

Huge demand for NTR Aravinda sametha karnataka rights
Highlights

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా 4 విజయాలతో ఫుల్ జోరు మీదున్నాడు….రీసెంట్ గా తెలుగు హీరోలలో ఈ రేంజ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి. 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా 4 విజయాలతో ఫుల్ జోరు మీదున్నాడు….రీసెంట్ గా తెలుగు హీరోలలో ఈ రేంజ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి. సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటు దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ షూటింగ్ లేట్ గా మొదలు అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఇలా షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్స్ చేశారో లేదో వరుసగా బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమా కి ఎగబడి వస్తున్నాయి. అందునా పక్క రాష్ట్రం నుండి కూడా ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తుండటం ఈ సినిమా పై నెలకొన్న క్రేజ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు. కర్ణాటకలో అల్టిమేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో లలో యంగ్ టైగర్ ముందుంటారు. అక్కడ తారక్ సినిమాలకు విపరీతమైన డిమాండ్. అక్కడ వరుసగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు భారీ గా ఉండటంతో ఎన్టీఆర్ 28 వ సినిమా కి ఇప్పటి నుండే అక్కడ 11.5 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయట. ఇది నిజం అయితే కనుక ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి పక్కకు పెడితే అక్కడ ఇప్పటి వరకు ఏ సినిమా 10 కోట్ల బిజినెస్ కూడా అందుకోలేదు.

loader