ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాహో టీజర్ తో సౌత్ ఆడియెన్స్ లలో అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. సినీ ప్రేమికుల కళ్ళు రెండు సాహో పైనే పడింది. అలాగే బాలీవుడ్ జనాలు కూడా బాహుబలి హీరో కోసం అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. 

ఎందుకంటే ఇటీవల ఇంటర్నెట్ సర్వేలలో  60 శాతం మందికి పైగా ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యే సాహో కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నట్లు ఓట్ చేశారు. సాహో తమిళ్ - మలయాళంతో పాటు హిందీలో కూడా భారీగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్ట్ 15న మరో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా హై లెవెల్లో రిలీజ్ కావడానికి సిద్ధమయ్యాయి. 

అక్షయ్ కుమార్ మిషిన్ మంగళ్యాన్ తో పాటు జాన్ అబ్రహం బట్లా హౌస్ సాహో తో సమరానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలపై మొదట్లో అంచనాలు బాగానే ఉన్నప్పటికీ సాహో టీజర్ అనంతరం ఆడియెన్స్ ద్రుష్టి మారింది. మిషీన్ మంగళ్యాన్ కోసం 17% శాతం మంది ఎదురుచూస్తున్నట్టు తెలియగా బాట్ల హౌస్ కోసం 12% మంది ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. 

సినీ క్రిటిక్ కేఆర్కే నిర్వహించిన సర్వేలో ఈ విధంగా రిజల్ట్ వెలువడింది. ఇంటర్నెట్ లో సాహో బజ్ మాములుగా లేదు. దీంతో అక్షయ్ - జాన్ అబ్రహం సినిమాల నిర్మాతల్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది. కుదిరితే సినిమాలను వాయిదా వేసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారట.