కొణిదెల ప్రొడక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా వెండితెరపై కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. 

మెయిన్ గా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 270కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో విఎఫ్ఎక్స్ కోసం 40కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. సినిమాలో సరికొత్త విజువల్స్ కోసం చిత్ర యూనిట్ దాదాపు 17 దేశాల్లో విఎఫ్ఎక్స్ పనులను జరిపిందట. మొదట 25కోట్ల లోపే పూర్తి చేయాలనికున్నప్పటికీ సినిమా షూటింగ్ అనంతరం అనుకోకుండా 40కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. 

మరి ఈ స్థాయిలో ఖర్చు చేసిన నిర్మాత రామ్ చరణ్ ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో జులై 2న ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మరికొన్ని రోజుల్లో చిత్ర యూనిట్ భారీగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది.