మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస హిట్స్ అందుకొని దూసుకుపోయాడు. కానీ ఆ తరువాత వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని 'చిత్రలహరి' సినిమా చేశాడు. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయిన ఏవరేజ్ మార్కులతో పాసైపోయింది.

ఇప్పుడు ఈ మెగాహీరో డైరెక్టర్ మారుతితో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఒకప్పుడు సాయి ధరం తేజ్ సినిమాలకు ఇరవై కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యేది కానీ ఇప్పుడు మాత్రం అతడి మార్కెట్ బాగా పడిపోయింది.

'చిత్రలహరి' సినిమా రూ.14 కోట్లు వసూలు చేయడానికే నానాతిప్పలు పడింది. ఈ క్రమంలో అతడి కొత్త సినిమాపై ఏకంగా పాతిక కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా మారుతి కాబట్టి ఇంత మొత్తం పెట్టడానికి సిద్ధమయ్యారనుకుంటే.. అతడికి ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేదు.

ఇటువంటి తరుణంలో పాతిక కోట్ల బడ్జెట్ అంటే.. దానికి తగ్గట్లుగా బిజినెస్ అవుతుందా..? అనేసందేహాలు కలుగుతున్నాయి. డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకొని రూ.5 కోట్లు వచ్చినా.. ఇరవై కోట్లకు పైగా సినిమాను అమ్మాలి అంటే మామూలు విషయం కాదు.. మరేం జరుగుతుందో చూడాలి!