టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ 'బాహుబలి' చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్ కూడా బాగానే పెరిగింది.

అప్పటివరకు స్టార్ హీరోల సినిమా మీద వంద కోట్లు పెట్టడానికి ఆలోచించే నిర్మాతలు 'బాహుబలి' స్పూర్తితో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో చాలానే సినిమాలే రూపొందుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించే సినిమాల బడ్జెట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. 

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న 'సాహో' సినిమాను మొదట రెండు వందల కోట్లలో రూపొందించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో యాభై కోట్లు పెరగనుందని తెలుస్తోంది. అలానే 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమాకు కూడా రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని వినికిడి.

పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందించనున్న సినిమాకు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో పాతకాలం సెట్లు, నిర్మాణ ఖర్చు మొత్తం కలుపుకొని రెండు వందల కోట్లు దాటేసిందట. మొత్తానికి మార్కెట్ లో డార్లింగ్ డిమాండ్ మాములుగా లేదుగా!