మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. రాకేష్ శశి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాధారణంగా చిన్న హీరోలు, అప్ కమింగ్ హీరోల మీద మూడు నుండి నాలుగు కోట్ల బడ్జెట్ కు మించి పెట్టరు. ఒకవేళ ఖర్చు పెట్టినా.. ఆ రేంజ్ బిజినెస్ జరుగుతుందో లేదోననే సందేహంతో నిర్మాతలు కూడా సాహసం చేయరు. కళ్యాణ్ దేవ్ సినిమాకు కూడా సాయి కొర్రపాటి మూడు నుండి  నాలుగు కోట్ల బడ్జెట్ అనుకున్నారు.

దానికి తగ్గట్లు మొత్తం డిజైన్ కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కెమెరామెన్ గా సెంథిల్ సెట్ లో అడుగుపెట్టాడో.. కాల్క్యులేషన్స్ మొత్తం మారిపోయాయి. టెక్నికల్ గా సినిమా రేంజ్ కాస్త పెరిగింది. దీంతో సినిమా నిర్మాణానికి, పబ్లిసిటీ వగైరా మొత్తం కలుపుకొని బడ్జెట్ ఏడు కోట్లు దాటేసిందని సమాచారం. పైగా ఇప్పటివరకు సినిమా బిజినెస్ కూడా మొదలుపెట్టలేదు.

సాధారణంగా అయితే సాయి కొర్రపాటి తన సినిమాలను తనే స్వయంగా పంపిణీ చేసుకుంటాడు. నైజాం మాత్రం సురేష్ బాబు చేస్తుంటాడు. మరి ఈ సినిమా సంగతేంటి అనే విషయం ఇంకా తేలలేదు. కానీ ఒక అప్ కమింగ్ హీరో మీద ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి కళ్యాణ్ ఆ రేంజ్ వసూళ్లను  రాబడతాడేమో చూడాలి!