హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసానె ఖాన్ సోషల్ మీడియా పోస్టుపై ఆసక్తికర కామెంట్ చేశారు. దీనితో హృతిక్ రోషన్ కామెంట్ వైరల్ గా మారింది. ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానే ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు . తన ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అనేక విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఆమెతో విడిపోయి చాలా కాలం అవుతున్నా, హృతిక్ మాత్రం ఆమె పోస్ట్స్ కి స్పందించడం విశేషం. 


తాజాగా ఓ మిర్రర్ సెల్ఫీ తీసుకున్న సుసానే ఖాన్... ఆ ఫోటో పోస్ట్ చేయడంతో పాటు ''కొన్ని సార్లు నాకు నేను అబ్బాయి అనే ఫీలింగ్ కలుగుతుంది'' అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ పై స్పందించిన హృతిక్ 'హ హ హ నైస్ పిక్' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ కామెంట్ వైరల్ గా మారింది. 


హృతిక్, సుసానే ఖాన్ 2000లో ప్రేమ వివాహాం చేసుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా, పిల్లల కోసం వీరు సన్నిహితంగానే ఉంటున్నారు. విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. అప్పుడప్పుడు ఇద్దరూ కలవడం విశేషం. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sussanne Khan (@suzkr)