Asianet News TeluguAsianet News Telugu

యంగ్ బ్యూటీతో హృతిక్ రోషన్ లవ్ ఎఫైర్.. ఇద్దరూ కలసి డిన్నర్ డేట్ కి ?

బాలీవుడ్ లో మగువలకు రాకుమారుడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరో. క్రిష్ సిరీస్ తో హృతిక్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని అలరిస్తున్నాడు.

Hrithik Roshan Papped Holding Hand Of A Mystery Girl
Author
Hyderabad, First Published Jan 29, 2022, 5:24 PM IST

బాలీవుడ్ లో మగువలకు రాకుమారుడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరో. క్రిష్ సిరీస్ తో హృతిక్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని అలరిస్తున్నాడు. సౌత్ లో కూడా హృతిక్ రోషన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని వివాదాలు, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుహాన్నే ఖాన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే హృతిక్, సుహాన్నే ఇద్దరూ తమ పిల్లల కోసం తల్లిదండ్రులుగా, స్నేహితులుగా కొనసాగుతున్నారు. 

విడిపోయాక కూడా హృతిక్, సుహాన్నే ఇద్దరూ కలసి తమ పిల్లలని వెకేషన్ కి తీసుకెళ్లడం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి హృతిక్ రోషన్ సింగిల్ గానే ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా హృతిక్ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. 

రీసెంట్ గా హృతిక్ రోషన్ కొత్త రిలేషన్ షిప్ మొదలు పెట్టినట్లు బి టౌన్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి ఓ మహిళ చేయి పట్టుకుని వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ మహిళతో హృతిక్ ఎఫైర్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆమె మాస్క్ పెట్టుకుని ఉండడంతో ఎవరనేది కనుక్కోవడం కష్టంగా మారింది. కానీ నెటిజన్లు కనిపెట్టేశారు. హృతిక్ చేతిలో చేయి వేసి వస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు.. ఓటిటితో గుర్తింపు పొందిన సబా ఆజాద్ అని అంటున్నారు. గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఆంథాలజీ ‘ఫీల్స్ లైక్ ఇష్క్’లో సబా నటించింది. అలానే ఆమె నటించిన ‘రాకెట్ బాయ్స్’ సీరిస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. హృతిక్, సబా ఇద్దరూ డిన్నర్ డేట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. 

హృతిక్ రోషన్ సబా ఆజాద్ విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటూ ఆమెని కారు ఎక్కిస్తున్నాడు. దీనితో హృతిక్, సబా ఆజాద్ మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతోంది అంటూ నెటిజన్లు ఓ నిర్ణయానికి వచ్చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios