రీసెంట్ గా హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు.హృతిక్ స్వయంగా విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. హృతిక్ కనీసం నడవలేని స్థితిలో కనిపిస్తున్నాడు.
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ రీసెంట్ గా ఫైటర్ చిత్రంతో అలరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా తెలియజేసేలా తెరకెక్కించిన ఫైటర్ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ వార్ 2లో నటించాల్సి ఉంది. ఆల్రెడీ ఈ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్ 2 భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే రీసెంట్ గా హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు.
హృతిక్ స్వయంగా విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. హృతిక్ కనీసం నడవలేని స్థితిలో కనిపిస్తున్నాడు. నడుముకి బెల్ట్ కట్టుకుని వీల్ చెయిర్, క్రచెస్ సహాయంతో ఉండడం చూడవచ్చు. దీనిని బట్టి హృతిక్ రోషన్ గాయం తీవ్రత ఎక్కువే అని చెప్పొచ్చు.
చూస్తుంటే హృతిక్ కోలుకునేందుకు కాస్త సమయం పట్టేలా ఉంది. దీనితో వార్ 2 ఆలస్యం కాక తప్పదని బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. అంటే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కావడం కూడా బాగా లేట్ అవుతుందని అంటున్నారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న వార్ 2లో తమ హీరోని వీలైనంత త్వరగా తారక్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
హృతిక్ తన గాయం గురించి పోస్ట్ చేస్తూ.. మీకు ఎవరికైనా ఇలా వీల్ చైర్, క్రచెస్ సహాయం అవసరం అయిందా ? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి అని హృతిక్ ప్రశ్నించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు హృతిక్ అభిమానులకు తెలిపాడు. ఫైటర్ షూటింగ్ లో హృతిక్ గాయపడ్డట్లు తెలుస్తోంది.
