బ్రహ్మస్త్ర హిట్ తో బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసం భారీ ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్.. అందులో భాగంగానే బాలీవుడ్ కండల వీరుడు హృతిక్  రోషన్ ను రంగంలోకి దింపబోతున్నారట టీమ్.. ఇందులో నిజమెంత....?

చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ ను ఒక రకంగా ఆదుకుంది బ్రహ్మస్త్రా సి నినిమా. మంచి కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాను మించి బ్రహ్మస్త్రా పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి మరింత కలరింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. పార్ట్ 2 కోసం ఇంకాస్త ఇమేజ్ ఉన్న స్టార్లను తీసుకోవాలి అనుకుంటున్నారట. 

అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన బ్రహ్మాస్త్రలో రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మాస్త్ర 1 శివ పేరుతో రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర మేకర్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువగానే విజయం సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు టీమ్. ఇప్పనటికే పనులు కూడా మొదలు పెట్టేశారట. బ్రహ్మాస్త్ర దేవ్‌ పేరుతో సెకండ్ పార్ట్ మూవీ తెరకెక్కబోతోంది. ఇక ఈమూవీలో దేవ్‌ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

అయితే బాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం హృతిక్‌ రోషన్‌ ఈ మూవీలో దేవ్‌గా కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. కాని ఈ విషయం గురించి రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్‌ రోషన్‌ను ప్రశ్నించారు. దానికి హృతికర్ సమాధానం ఇస్తూ.. ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు రాలేదు. అయితే ఏదైనా జరగొచ్చు. అవకాశం వస్తుందనే ఆశిస్తున్నా అంటూ చెప్పీ చెప్పనట్టుగా సమాధానం చెప్పారు. దాంతో హృతిక్ ఈ సినిమాలో నటిస్తారు అనే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నారు హృతిక్ రోషన్. హృతిక్‌ తన కొత్త సినిమా విక్రమ్‌ వేద ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. విక్రమ్ వేదాతో పాటుగా బాలీవుడ్ మూవీ ఫైటర్ లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈసినిమా కూడా రిలీజ్ కు ముస్తాబవుతుంది.