లాస్ట్ ఇయర్ వార్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. ఈ సారి ఫైటర్ గా రాబోతున్నాడు. యాక్షన్ స్టోరీతో  తెరకెక్కిన హ్యాండ్సమ్ స్టార్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. 

లాస్ట్ ఇయర్ వార్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. ఈ సారి ఫైటర్ గా రాబోతున్నాడు. యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన హ్యాండ్సమ్ స్టార్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. 

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ న‌టిస్తోన్నయాక్షన్ మూవీ ఫైట‌ర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికాప‌దుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బీటౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫైట‌ర్ కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

Scroll to load tweet…

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రం 2023 సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.బాలీవుడ్ యాక్ట‌ర్ అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌ చేస్తోన్న ఈ మూవీ ఇండియా తొలి ఏరియ‌ల్ యాక్ష‌న్ ఫిల్మ్ గా రాబోతుంది. ఈ సినిమాలో హృతిక్ డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. డాన్సింగ్ స్టార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

హృతిక్ రోష‌న్ మ‌రోవైపు విక్ర‌మ్ వేధ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. విక్ర‌మ్ వేధ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.త‌మిళ్‌లో సూపర్ హిట్ అయిన విక్ర‌మ్ వేధ‌ సినిమాను సేమ్ టైటిల్‌తో హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు సైఫ్ అలీఖాన్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నాడు.