తాను నైట్‌ క్లాబ్‌లో అరెస్ట్ అయిన బెయిల్‌పై విడుదలైనట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై తాజాగా హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ స్పందించారు. తాను అరెస్ట్ కాలేదని తెలిపారు. తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలనీ పేర్కొన్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా వార్తలు రాయడంపై ఆమె ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు సుసానే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. 

ఇందులో ఆమె చెబుతూ, `సోమవారం రాత్రి క్లోజ్‌ ఫ్రెండ్‌ బర్త్ డే పార్టీ కోసం ముంబయిలోని మారియట్‌లోని డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. డిన్సర్‌ టైమ్‌ ఎక్స్ టెండ్‌ అయ్యింది. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో అధికారులు వచ్చారు. కొత్తగా విధించిన కరోనా నిబంధనల గురించి చెక్‌ చేశారు. యాజమాన్యంతో మాట్లాడారు. కరోనా నిబంధనల మేరకు మరో మూడు గంటలు బయటకు వెళ్లకూడదన్నారు. దీంతో అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉదయం ఆరు గంటలకు మమ్మల్ని బయటకు పంపించారు. నేను అరెస్ట్ అయ్యానంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి పూర్తిగా అవాస్తవాలు. బాధ్యతారహితమైనవి` అని మండిపడ్డారు. 

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నైట్‌ క్లబ్‌లు, పబ్‌లో ఇలా అన్ని రాత్రి 11.30వరకు మూసివేయాలి. దానికి విరుధ్ధంగా అర్థరాత్రి తర్వాత కూడా క్లబ్‌ని తెరిచి ఉంచినందుకు డ్రాగన్‌ క్లబ్‌ నిర్వహకులను, అందులో ఉన్న 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, మార్నింగ్‌ విడిచిపెట్టారని వార్తలు వినిపించాయి. ఇందులో క్రికెటర్‌ సురేష్‌ రైనా, హృతిక్‌ మాజీ భార్య సుసానే ఖాన్ వంటి వారు ఉన్నారు. ఇందులో తన పేరు రావడంతో సుసానే తాజాగా స్పందించి వివరణ ఇచ్చింది.