#FighterOTT:హృతిక్ ‘ఫైట‌ర్‌’ OTT రిలీజ్ డేట్, ఎప్పుడు ,ఎక్కడ స్ట్రీమింగ్

పుల్వామా దాడి, ఆ త‌ర్వాత  సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో స‌న్నివేశాల్ని మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. 

Hrithik Roshan and Deepika Padukone Fighter OTT Release Date Confirmed jsp


భారీ యాక్ష‌న్ చిత్రాల‌ే ఇప్పుడు బాలీవుడ్ లో ఆడుతున్నాయి. ఆ విషయం పసిగట్టి దాదాపు  రూ.250 కోట్లుపై చిలుకు ఖర్చుతో  అక్క‌డ రెడీ అయ్యి రిలీజైన చిత్రమే ‘ఫైట‌ర్‌’. లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా చిత్రాల‌కి కేరాఫ్‌గా మారిన సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్ హీరో గా సినిమా అంటే ఎన్నోఎక్సపెక్టేషన్స్ . దానికితోడు విజ‌య‌వంత‌మైన ‘ప‌ఠాన్‌’ త‌ర్వాత వ‌స్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావ‌డం,  ‘వార్‌’ త‌ర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావ‌డంతో ‘ఫైట‌ర్‌’ ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుల్నిఎట్రాక్ట్ చేసింది. (Fighter) అయితే ఈ చిత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. హృతిక్‌, దీపిక కలిసి చేసిన యాక్షన్‌ హంగామా మరీ అతిగా ఉందని పెదవి విరిచారు ప్రేక్షకులు.  దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్  డ్రామా ఇది. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

 ‘ఫైట‌ర్‌’   డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 'ఫైటర్' ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు సమాచారం. థియేటర్లో విడుదలైన 56 రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌నే ఎగ్రిమెంట్ కూడా చేసుకున్నార‌ట మేక‌ర్స్. దీంతో సినిమా రిలీజైన 56వ రోజు.. అంటే మార్చి 21న ఈ  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ అఫీషియల్ ఇన్ఫర్మేషన్  ఏదీ రాలేదు.

దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దుల్లో  మ‌న వాయు సేన చేసే పోరాటం చుట్టూ సాగే క‌థ ఇది. (Fighter Movie) మ‌న వీరులు గ‌గ‌న‌తలంలో చేసే సాహ‌స విన్యాసాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో క‌థ కంటే కూడా డ్రామా, యాక్ష‌న్‌తో కూడిన హంగామానే ఎక్కువ‌. శ‌త్రుదేశ‌మైన పాకిస్థాన్‌, అక్క‌డ ఉగ్ర‌వాదులు క‌లిసి ప‌న్నే ప‌న్నాగాల చుట్టూనే తిరుగుతుంది.   ఓ ఫైట‌ర్ పైల‌ట్ పోరాట ప‌టిమ చుట్టూ అల్లిన డ్రామానే ఈ సినిమాకి హైలైట్‌. పుల్వామా దాడి, ఆ త‌ర్వాత  సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో స‌న్నివేశాల్ని మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. 

 ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనెలతో పాటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వ‌హించారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios