హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. అక్టోబర్ 2 విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హాట్ బ్యూటీ వాణి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతోంది. 

ఈ చిత్రానికి సౌత్ కొరియాకు చెందిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సీయంగ్ హో పనిచేశారు. సీయంగ్ హో ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కష్టం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ తన సేఫ్టీని కూడా పట్టించుకోకుండా రిస్క్ చేశాడని సీయంగ్ తెలిపారు. 

హృతిక్ రోషన్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుంటే చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఆ సన్నివేశాల్ని హృతిక్ చాలా పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి చిరునవ్వుతో బయటకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేటర్స్ లో హృతిక్ పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారని సీయంగ్ తెలిపారు. ఎవెంజర్స్, స్నోపైసేర్ లాంటి చిత్రాలకు సీయంగ్ యాక్షన్ డైరెక్టర్ గా పనిచేశారు. 

ఇక టైగర్ ష్రాఫ్ ప్రతి చాలా కష్టతరమైన స్టంట్స్ ని కూడా సింగిల్ షాట్ లో పూర్తి చేశాడని సీయంగ్ అన్నారు. వార్ మూవీలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోంది. హృతిక్ రోషన్ తో కలసి వాణికపూర్ చేసిన డాన్స్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.