90వ దశకంలో మళయాళ సినిమా రంగంలో షకీలా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పట్లో  మలయాళం బాక్సాఫీసు దగ్గర స్టార్  హీరోలను సైతం వెనక్కి నెట్టేసి షకీలా తన  సినిమాలతో  హవా కొనసాగించింది. ఆమె సినిమాలు సౌతిండియా అంతటా డబ్బింగ్ అయ్యి...భారీగా రిలీజ్ అయ్యి డబ్బులు చేసుకునేవి. దాంతో షకీలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు లగ్జరీ జీవితం అనుభవించిన ఆమె తర్వాత అన్నీ కోల్పోయి చాలా ఇబ్బందిరక జీవితం గడుపుతోంది. 

ఈ నేఫధ్యంలో షకీలా జీవితం ఆధారంగా ఇపుడు బాలీవుడ్లో బయోపిక్ తెరకెక్కుతోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షకీలా పాత్రను రీచా చద్దా పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ రిచా చద్దా షకీలా పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి 'షకీలా నాట్ ఎ  పోర్న్ స్టార్' అనేది టైటిల్ అని పెట్టారు. అయితే ఫోర్న్ స్టార్  బయోపిక్ లో నటించటమేంటి అని అంతా ఆమెను అడుగుతున్నారు. 

దానికి ఆమె సూటిగా సమాధానం చెప్పారు.  అందరూ అనుకున్నట్టుగా ఇది పోర్న్‌ సినిమా కాదనీ, ఓ నటి జీవితంలో చీకటి వెలుగులను మాత్రమే  చూపించారంటోంది రిచా చద్దా. అలాగే ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాల వివరించారామె. 

రిచా ఛద్దా మాట్లాడుతూ.. ‘‘షకీలా  కథ విన్నప్పుడు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. ఇప్పుడు ఈ రంగంలో వినిపిస్తున్న వేధింపుల గురించి ఉద్యమం మొదలైంది కానీ, షకీలా 90వ దశకంలోనే తనకెదురైన వేధింపులను ధైర్యంగా ఎదిరించారు. ఆవిడకి చాలా ధైర్యం. ఆవిడని అందరూ పోర్న్‌ స్టార్‌ అనుకుంటారు కానీ ఆవిడలో మంచి నటి దాగి ఉంది. ఆవిడ కథ విన్న తరువాత ఎలాగైనా ఈ సినిమా చేయాలనిపించింది. అందుకే ఒప్పుకున్నాను..’’ అని అన్నారు. 

ఈ బయోపిక్ మూవీలో షకీలా జీవితంలోని ముఖ్య ఘట్టాలు చూపించబోతున్నారు. ఆమె అడల్ట్ సినిమా రంగం వైపు ఎలా వెళ్లారు? ఆ రంగంలో అంత పెద్ద స్టార్‌గా ఎదగడానికి కారణమైన అంశాలేమిటి? అనేది ఇందులో చూపించబోతున్నారు.