తాజాగా నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటో బయటకు వచ్చి మెగాభిమానులకు ఆనందం కలగచేసిన సంగతి తెలిసిందే. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నారు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టులో నిహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే అసలు నీహారిక, చైతన్య వివాహానికి దారితీసిన పరిస్దితిలు ఏమిటి....వీరిది ప్రేమ వివాహమా అనే సందేహాలు, చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

అందుతున్న సమాచారం ప్రకారం....గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. అయితే, ఈ సంబంధం సెట్ చేసిన పెద్ద మనిషి..నీహారిక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి.నీహారిక ఉడ్ బి చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య (తల్లితరపు) తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు. అందువల్ల ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా కలుస్తూ ఉన్నారు.  

చిరంజీవికి, చైతన్య తండ్రి జె. ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపధ్యంలో  కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ రావు గారు మాటల్లో మాటగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అని చిరుతో అన్నారు. ఆ తర్వాత ఈ విషయం గురించి బాగా ఆలోచించిన చిరంజీవి ఎవరికో ఎందుకు తన కుమార్తె నిహారికని ఇచ్చి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని భావించి చిరంజీవినే ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావు వద్దకు తీసుకెళ్లారట. ఆ విధంగా ఈ వివాహం సెట్ అయ్యింది.
 
ఇక నీహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ ఆగస్టులో జరగనుంది. వివాహం పిభ్రవరి 2021లో చేస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాసం ఉంది. గతంలో నాగబాబు తన కూతురి వివాహ విషయాలను ప్రస్తావించారు. 'వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నీహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం తనకో మంచి వరుణ్ని వెతికే పనిలో ఉన్నాం. నీహారిక పెళ్లి తర్వాత వరుణ్‌తేజ్‌ పెళ్లి గురించి ఆలో చిస్తాం. వీరిద్దరి పెళ్లిళ్లు అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది' అని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.