ఫైనల్ లెక్క: ‘ఉప్పెన’ కు ఎంత లాభం వచ్చింది?
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం ఉప్పెన. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రచన సహకారం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోయింది. దాంతో హైయిస్ట్ కలెక్షన్స్, హైయిస్ట్ ఫ్రాఫిట్ షేర్ పొందిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 21 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 47 కోట్ల షేర్ తెచ్చుకుంది. దాంతో 26 కోట్లు ఫ్రాఫిట్స్ నిర్మాతలు జేబులో వేసుకున్నారు.
ముఖ్యంగా టికెట్ రేట్ల పెంచటం ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్న అఖిల్, చిరుతలను దాటేసి ఉప్పెన ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ఉప్పెన కు ప్లస్ అయ్యింది .
ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించటం బాగా కలిసొచ్చింది.
అలాగే ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకూ.. థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే 100 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఉప్పెనకు కలిసొచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ శని, ఆదివారంలతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఉప్పెన చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చింది.