Asianet News TeluguAsianet News Telugu

‘న‌ర్త‌న‌శాల’ ఒక్కో టిక్కెట్ రూ.10 ల‌క్ష‌ల‌ు పెట్టి కొనబోతున్నారు

 సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. అదే బాల‌య్య అభిమాని అయితే టికెట్ ని ఎంత‌కైనా కొనొచ్చు. కొంత‌మంది బాలయ్య అభిమానులు `న‌ర్త‌న శాల‌` టికెట్ ని రూ.10 ల‌క్ష‌ల‌కు కొనాల‌ని ఇప్పటికే ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. అలా కొనుక్కున్న వారి  వివ‌రాల్ని త్వ‌ర‌లోనే బాల‌య్య ప్ర‌క‌టించ‌బోతున్నారు.

How much is Balayya charging for Nartanasala streaming? jsp
Author
Hyderabad, First Published Oct 21, 2020, 7:05 AM IST

నందమూరి  బాలకృష్ణ కీలక పాత్రల్లో, స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘నర్తనశాల’. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో ‘నర్తనశాల’ అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించారు.  ఎన్నోఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రారంభమైన షూటింగ్‌ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఇప్పటికే విడుదల చేసారు. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. దీంతో మరో పౌరాణిక పాత్రలో బాలయ్యను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎంత టిక్కెట్ పెట్టి ఈ వీడియోని చూడాలి అంటే...టికెట్ ధ‌ర‌ని 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించిన‌ట్టు టాక్‌.

 అయితే బాల‌య్య ఫ్యాన్స్ కు ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావిస్తున్నారు. అందుకే త‌న అభిమానుల్నీ ఇందులో భాగ‌స్వాములుగా చేద్దామ‌ని భావిస్తున్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. అదే బాల‌య్య అభిమాని అయితే టికెట్ ని ఎంత‌కైనా కొనొచ్చు. కొంత‌మంది బాలయ్య అభిమానులు `న‌ర్త‌న శాల‌` టికెట్ ని రూ.10 ల‌క్ష‌ల‌కు కొనాల‌ని ఇప్పటికే ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. అలా కొనుక్కున్న వారి  వివ‌రాల్ని త్వ‌ర‌లోనే బాల‌య్య ప్ర‌క‌టించ‌బోతున్నారు.
 
ఇక గత ఏడాది ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌తో ప్రేక్షకుల్ని అలరించిన బాలయ్య ఆ తర్వాత ‘రూలర్’లో కనిపించారు. ప్రస్తుతం ఆయన 106వ చిత్రం పనులు జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ని  సైతం విడుదల చేశారు. నయనతార, శ్రియ ఇందులో హీరోయన్స్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios