నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత ?.. నష్టం ఎన్ని వందల కోట్లో తెలుసా ?
ప్రముఖ నటుడు, కింగ్ నాగార్జున శనివారం ఉదయం నుంచి వివాదభరితమైన అంశంతో వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో ఆ మాటకొస్తే ఇండియాలోనే అత్యంత ధనిక నటుల్లో నాగార్జున ఒకరు. సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి.
ప్రముఖ నటుడు, కింగ్ నాగార్జున శనివారం ఉదయం నుంచి వివాదభరితమైన అంశంతో వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో ఆ మాటకొస్తే ఇండియాలోనే అత్యంత ధనిక నటుల్లో నాగార్జున ఒకరు. సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి. అయితే నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే.
గత పదేళ్లుగా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన వివాదం రగులుతోంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెరువుని ఆక్రమించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేయడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత.. నాగార్జునకి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. కూల్చేయడం వల్ల ఎంత నష్టం లాంటి అంశాలు వైరల్ అవుతున్నాయి. వినిపిస్తున్న అంచనా ప్రకారం ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్లు అని తెలుస్తోంది.
ఈ ఫంక్షన్ హాల్ ని ఉపయోగించుకోవడానికి కోట్లల్లో ఖర్చు అవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్. కూల్చివేత వల్ల వందల కోట్లల్లో నష్టం వాటిల్లిందని అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేత చట్ట విరుద్ధం అని అన్నారు.
మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు.. నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. తుమ్మిడి కుంట చెరువులో కొన్ని ఎకరాలని అక్రమంగా ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ.హైడ్రా అధికారులు దీనికి సంబంధించిన ఆధారాలతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు.