Asianet News TeluguAsianet News Telugu

ఈ ఫోటో మీకెలా దొరికింది..? సర్ప్రైజ్ అయిన సమంత!

అక్కినేని సమంత చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి ఆమెని సర్ప్రైజ్ చేశాడు ఓ నెటిజన్. 

how did you get this picture asks samantha
Author
Hyderabad, First Published Jul 11, 2019, 4:11 PM IST

అక్కినేని సమంత చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి ఆమెని సర్ప్రైజ్ చేశాడు ఓ నెటిజన్. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సమంతకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు తన పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. వారందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నారు. 

ఈ క్రమంలో సమంత అభిమాని ఒకరు ఆమె చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'పిక్చర్ ఆఫ్ ది డే' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన సమంత సర్ప్రైజ్ అయింది. 'ఈ ఫోటో మీకెలా దొరికింది' అంటూ ఎంతో ఎగ్జైట్ అయింది.

మరో అభిమాని.. సమంత, చైతు, అఖిల్ ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన సామ్ 'ఆ రోజు ఏం మాట్లాడుకున్నామో.. నాకు ఇప్పటికీ గుర్తుంది' అని బదులిచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios