Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌ సినిమాకి హాలీవుడ్‌ టచ్‌ ఇస్తున్న కొరటాల.. వీఎఫ్‌ఎక్స్ కోసం కొత్త టెక్నీషియన్‌..

ఎన్టీఆర్‌30 సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లని రంగంలోకి దించుతున్నారు దర్శకుడు కొరటాల శివ. మొన్న స్టంట్‌ మాస్టర్‌, ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ కోసం హాలీవుడ్‌  టెక్నీషియన్‌ని తీసుకొచ్చారు.

hollywood vfx technician work for ntr30 movie fan full kushi arj
Author
First Published Mar 28, 2023, 11:58 AM IST

ఎన్టీఆర్‌(NTR)తో సినిమాని భారీ స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ(Koratala Siva). సైలెంట్‌గా ఇంటర్నేషనల్‌ రేంజ్‌కి తీసుకెళ్తున్నారు. వరుసగా హాలీవుడ్‌ టెక్నీషియన్లని దించుతున్నారు. ఇప్పటికే యాక్షన్‌కి సంబంధించిన `మిష్‌ ఇంపాజిబుల్‌`, `ట్రాన్స్ ఫార్మర్స్`, `రాంబో 3` చిత్రాలకు పనిచేసిన స్టండ్‌ డైరెక్టర్‌ కెన్నీ బాట్స్ ని దించారు. ఇటీవలే యాక్షన్‌ సీక్వెన్స్ కి సంబంధించిన ప్లాన్స్ కూడా జరిగాయి. ఇంతలోనే మరో క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ చిత్రానికి మరో హాలీవుడ్‌ టెక్నీషియన్‌ని దించారు. 

వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌ని రంగంలోకి దించారు. `ఆక్వామెన్‌`, `జస్టిస్‌ లీగ్‌`, `బ్రాడ్‌ మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌మ్యానర్‌` చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ బ్రాడ్‌ మిన్నిచ్‌ (Brad Minnich) ని రంగంలోకి దించారు. తాజాగా దర్శకుడు కొరటాల.. ఆయనతో సెట్‌లో డిస్కస్‌ చేస్తున్న ఫోటోని పంచుకుంది యూనిట్‌. కీలక సన్నివేశాలకు ఆయన సారథ్యంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందని టీమ్‌ తెలిపింది.  నేటి నుంచి ఆ వర్క్ కూడా ప్రారంభమైనట్టు వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్‌ 30 చిత్రానికి హాలీవుడ్‌ టచ్‌ గట్టిగానే ఇస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాదు పాన్‌ ఇండియా రేంజ్‌ని దాటుకుని ఇది పాన్‌ వరల్డ్ మూవీగా మారబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొరటాల ఏం చేయబోతున్నారో చూడాలి. 

ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలై ఏడాది తర్వాత `ఎన్టీఆర్‌ 30`(NTR30) చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవల గ్రాండియర్‌ లెవల్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఆమె కోసం భారీగానే పారితోషికం అందిస్తున్నారట. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కుతుంది. కళ్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె నిర్మాతలు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌ టార్గెట్‌గా తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సినిమాకి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కథ పరంగా చూస్తే ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల ఇటీవల ఓపెనింగ్‌లోనే రివీల్‌ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో అందరూ మర్చిపోయిన ఓ భూభాగంలోని మృగాల్లాంటి మనుషులు మధ్య సాగే కథ అని తెలిపారు. భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం ఏంటనేదే ఈ సినిమా కథ అని చెప్పారు కొరటాల. 

Follow Us:
Download App:
  • android
  • ios