విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌`. `సాలా క్రాస్‌బ్రీడ్‌` అనేది ట్యాగ్‌లైన్‌. తెలుగు, హిందీలో రూపొందుతున్న ఈ సినిమాకి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా ఈ చిత్ర షూటింగ్‌ జరుపుకుంటోంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో ఎట్రాక్షన్‌ తోడయ్యింది. హాలీవుడ్‌ స్టంట్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ సినిమా కోసం పనిచేస్తున్నారు. బాక్సింగ్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాకి ఆండీ లాంగ్‌ ఫైట్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేస్తుండటం విశేషం. ఆయన గతంలో జాకీ ఛాన్‌ వంటి అనేక హాలీవుడ్‌ చిత్రాలకు స్టంట్‌ కొరియోగ్రాఫ

ర్‌గా పనిచేశారు. తాజాగా `లైగర్‌` కోసం ఇంటెన్స్ యాక్షన్‌ సీక్వెన్స్ ని ఆయన పర్యవేక్షణలో చిత్రీకరించబోతున్నారు. ఇందులో మిక్స్ డ్‌ మార్షల్‌ ఆర్ట్స్ కూడా ఉంటాయని చిత్ర బృందం చెప్పింది. 

ఆండీ లాంగ్‌ తో కూడిన ఫారెన్‌ టీమ్‌ ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు డిఫరెంట్‌ లొకేషన్లలో చిత్రీకరించబోతున్నారు. నెక్ట్స్ షెడ్యూల్‌లో ఈ ఫైట్‌ సీన్స్ షూట్‌ చేయనున్నారట. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కంప్లీట్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. సినిమాకి విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్‌ 9న తెలుగు, హిందీతోపాటు కన్నడ, తమిళం, మలయాళంలో విడుదల చేయబోతున్నారు.