Asianet News TeluguAsianet News Telugu

టైటానిక్ హీరోని కదిలించిన ఢిల్లీవాసుల ఆవేదన..!

లెనార్డో డికాప్రియో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడు. టైటానిక్ చిత్రంతో డికాప్రియో క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. డికాప్రియో ఇప్పటికి హాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు.

Hollywood star Leonardo DiCaprio raises concern on Delhi's air pollution
Author
Hyderabad, First Published Nov 21, 2019, 3:26 PM IST

లియోనార్డో డికాప్రియో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడు. టైటానిక్ చిత్రంతో డికాప్రియో క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. డికాప్రియో ఇప్పటికి హాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు. డికాప్రియో కేవలం నటనతో మాత్రమే కాదు.. మానవత్వం కలిగిన వ్యక్తిగా, ప్రకృతి ప్రేమికుడిగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. 

ఇండియాలో తీవ్రమవుతున్న ఓ సమస్యపై డికాప్రియో స్పందించడం ఆసక్తిగా మారింది. ప్రజల ఆవేదన అతడిని కదిలించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం అధికమవుతోంది. మాస్క్ లు లేకుండా జనాలు బయట తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యాన్ని మాత్రం తగ్గించలేకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Regram #RG @extinctionrebellion: Over 1500 citizens gathered in at India Gate, in New Dehli, to demand immediate action on the cities hazardous pollution levels.⁣ ⁣ According to the World Health Organisation, air pollution in India is estimated to kill about 1.5 million people every year; these statistics make air pollution the fifth-largest killer in India. ⁣ ⁣ People of all ages joined the demonstration, which succeeded to directly trigger action for Indian citizens:⁣ 1. The Indian Prime Ministers office set up a special panel to address the issue, within a few hours of the protest. The panel is due to report on the issue within 2 weeks.⁣ 2. The Supreme Court of India asked the Central Government and respective state governments to fix the crop and waste burning issue of Dehli within a week. ⁣ 3. The Center accepted that Green Fund will be used to combat toxic air pollution. ⁣ 4. The Indian Prime Minister asked the Agriculture Ministry to distribute equipment urgently so that crop burning is no longer necessary. ⁣ ⁣ Despite these promises, the air is still unsafe and activists will keep the pressure on until the air pollution reaches safe levels. ⁣ ⁣ The protest was organised by a collaboration of movements; @xrebellionind @LetMeBreathe_In @FridaysForFutureIndia_ along with other activists. ⁣ ⁣ Photography by Arjun Mahatta and co, via @FridaysForFuture ⁣ ⁣ #RightToBreathe #ExtinctionRebellion #IndiaGate #SolutionNotPollution #ActNow #RebelForLife

A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on Nov 18, 2019 at 7:24am PST

ఇటీవల ఢిల్లీవాసులు పలు పర్యావరణ పరిరక్షక సంస్థల ఆధ్వర్యంలో ఇండియా గేట్ వద్ద చేరి నిరసన తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చెప్పట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని ఏజ్ గ్రూపుల ప్రజలు పాల్గొనడం విశేషం. 

వారి నిరసన కార్యక్రమం డికాప్రియోని కదిలించింది. తన సోషల్ మీడియా వేదికగా డికాప్రియో ఢిల్లీ కాలుష్యం గురించి పోస్ట్ పెట్టి వివరాలన్నీ తెలియజేశాడు. డికాప్రియో ఈ పోస్ట్ లో తెలుపుతూ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఢిల్లీలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. 

పర్యావరణ లెక్కల ప్రకారం కాలుష్యం అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా ఐదవ స్థానంలో ఉంది. ప్రజలు చేసిన నిరసన కార్యక్రమం వల్ల భారత ప్రభుత్వం వెంటనే స్పందించి కొన్ని కాలుష్య నివారణ చర్యలు చేపడుతోందని డికాప్రియో తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. భారతదేశం పట్ల, ఢిల్లీ ప్రజల పట్ల డికాప్రియో చూపిన సానుభూతికి ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో మంటలు వ్యాపించినప్పుడు కూడా డికాప్రియో స్పందించాడు. చాలా మంది సెలెబ్రిటీలు ప్రపంచానికి ఊపిరి తిత్తులు లాంటి అమెజాన్ అడవులు తగలబడుతుంటే ఆందోళన వ్యక్తం చేశారు. డికాప్రియో ఆ మంటల్ని అదుపు చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వానికి దాదాపు 36 కోట్ల విరాళం అందించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios