ఎట్టకేలకు పెళ్ళి పీటలెక్కబోతున్నాడు తమిళ రొమాంటిక్ హీరో శింబు. రెండు మూడు లవ్ అఫైర్స్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసిన హీరో.. పెళ్లి చేసుకోబోయోది ఎవరినో తెలుసా..?
తన ఇద్దరు మాజీ లవర్స్ పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వడంతో.. తనకు కూడా పెళ్ళిపై గాలి మళ్ళినట్టుంది.. తమిళ హీరో శింబు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతునట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరున్న శింబు... తన వ్యావహార శైలీతో వెనకబడ్డాడు. కెరీర్ మంచి పులో ఉన్నప్పుడే మనోడు చేసిన పనులకు.. సినిమాలు తగ్గిపోయి.. హీరోగా కనుమరుగు అయ్యే స్టేజ్ కు వచ్చాడు శింబు. ఇక ఈమధ్యే మళ్లీ పుంజుకుంటున్నాడు తమిళ హీరో.
ఇక ఈక్రమంలోనే శింబుకు పెళ్ళి కుదిరినట్టు తమిళ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త గట్టిగాప్రచారం జరుగుతున్నాయి. అది కూడా కోటీశ్వరుల ఇంటికి అల్లుడిగా వెళ్లబోతున్నాడట కోలీవుడ్ హీరో. శింబు ఓ కోటీశ్వరురాలైన అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నారంట. శ్రీలంకకు చెందిన ఆ అమ్మాయి ప్రస్తుతం డాక్టర్ చదువుతోందట. ఆమె శింబుకు పెద్ద ఫ్యాన్ అని సమాచారం. దాంతో వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి వరకూ వచ్చిందంటున్నారు.
అమ్మాయి తండ్రి వందల కోట్ల రూపాయల బిజినెస్ నిర్వహిస్తున్నారని.. అంతే కాదు వీరి పెళ్లికి అందరు పెద్దలు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ఈఏడాదే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. అయితే..ఈ న్యూస్ ఇంకా అఫీషయల్ గా బయటకు రాలేదు కాని.. నెట్టింట మాత్రం గట్టిగా షికారు చేస్తుంది. త్వరలో శింబు నుంచి కానీ, ఆయన ఫ్యామిలీనుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక కోలీవుడ్ లో శింబు నడిపనించిన ప్రేమాయనాలు అన్నీ ఇన్నీ కావు.. ముందుగా కెరీర్ స్టార్టింలో హీరోయిన్ నయనతారతో ఘాడ ప్రేమలో మునిగి తేలాడు. ఇద్దరు ఒక దశలో సహజీవనమే చేశారు. పెళ్లి చూడాచేసుకోబోతున్నారు అనుకున్న టైమ్ లో ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. నయనతారతో బ్రేకప్ తర్వాత శింబు ఆమధ్య.. హీరోయిన్ హన్సిక మౌత్వానితో తెగ తిరిగేశాడు. వీరు కూడా ప్రేమలో మునిగి తేలారు. ఆతరువాత ఏమైందో ఏమో.. రీసెంట్ గా.. హన్సీక మరో పెళ్ళి చేసుకుంది. ఇక ఈక్రమంలో శింబు హీరోయిన్ నిథి అగర్వాల్ తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి. కాని అవి ఎక్కువ రోజులు నడవలేదు. తాజాగా ఆయన పెళ్ళి చేసుకోబోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.
