అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కుతున్న గుర్తింపు ఊహకు అందని విధంగా ఉంది. బాహుబలి చిత్రానికి కూడా వరల్డ్ వైడ్ గా ఇంత రీచ్ లభించలేదు అనే చెప్పాలి.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు. 

అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కుతున్న గుర్తింపు ఊహకు అందని విధంగా ఉంది. బాహుబలి చిత్రానికి కూడా వరల్డ్ వైడ్ గా ఇంత రీచ్ లభించలేదు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తుతం హాలీవుడ్ లో, నార్త్ కంట్రీస్ లో వైల్డ్ ఫైర్ లాగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎందరో హాలీవుడ్ ప్రముఖులు జక్కన్న చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 

తాజాగా ఆ జాబితాలోకి హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఎడ్గర్ రైట్ కూడా చేరారు. ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక ప్రసంశలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ' ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై భారీ ప్రేక్షకుల మధ్య చూశాను. బ్లాస్టింగ్ లాంటి ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఇంటర్వెల్ కార్డుకి ఈ స్థాయిలో అప్లాజ్ వచ్చిన ఏకైక చిత్రం చూస్తున్నా అని ప్రశంసించారు. 

మీ నుంచి ఇలాంటి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు క్రేజీగా అనిపిస్తోంది అని ఆర్ఆర్ఆర్ టీం ఎడ్గర్ కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది. ప్రఖ్యాత దర్శకుడు నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఎడ్గర్ రైట్ హాలీవుడ్ లో 'లాస్ట్ నైట్ ఇన్ సోహో, బేబీ డ్రైవర్ లాంటి అద్భుత చిత్రాలని తెరకెక్కించారు. యాంట్ మాన్ చిత్రానికి రచయితగా పనిచేశారు. 

Scroll to load tweet…