Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసి మోసం చేసింది, బాధ భరించలేక విపరీతంగా శృంగారం చేశా.. స్టార్ హీరో హాట్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సాధారణంగా మారిపోయాయి. హాలీవుడ్ లో ప్రేమ, డేటింగ్ లకు కొదవే లేదు. Hollywood స్టార్ హీరో విల్ స్మిత్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

Hollywood actor Will Smith reveals his first love breakup
Author
Hyderabad, First Published Nov 26, 2021, 12:52 PM IST

చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సాధారణంగా మారిపోయాయి. హాలీవుడ్ లో ప్రేమ, డేటింగ్ లకు కొదవే లేదు. Hollywood స్టార్ హీరో విల్ స్మిత్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. విల్ స్మిత్ నటించిన చిత్రాలు ఇండియన్ భాషల్లోకి కూడా డబ్ అవుతుంటాయి. విల్ స్మిత్ ఆ మధ్యన నటించిన అల్లాదీన్ చిత్రానికి తెలుగులో విక్టరీ వెంకటేష్ డబ్బింగ్ అందించారు. 

ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన విచిత్రమైన ప్రేమ కథని Will Smith వివరించాడు. తన 16వ ఏటనే ప్రేమలో పడ్డట్లు విల్ స్మిత్ చెప్పాడు. 16 ఏళ్ల వయసులో 'మెలానియా' అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఒకసారి మ్యూజిక్ కన్సర్ట్ కోసం 10 రోజులు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి నా ప్రేయసి మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. దీనితో ఆమెతో బ్రేకప్ చేసుకున్నా. 

ఫస్ట్ లవ్ కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యా. ఒత్తిడి నుంచి బయట పడేందుకు విపరీతంగా శృంగారంలో పాల్గొన్నాను అంటూ విల్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ శృంగారం కూడా నాకు సంతోషాన్నిచ్చేది కాదు. బాధని మరచిపోలేకపోయేవాడిని. ఎక్కువగా శృంగారం చేయడం వల్ల ఒక్కోసారి వాంతులు అయ్యేవి. అయినా అవేమీ పట్టించుకునేవాడిని కాదు అంటూ విల్ స్మిత్ తన చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు. 

Also Read: జారిపోయిన జాకెట్, అది వేసుకోవడం అవసరమా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఆరోజులు గుర్తుచేసుకుంటే అలా ప్రవర్తించింది నేనేనా అనే అనుమానం కలుగుతుంది అని విల్ స్మిత్ తెలిపాడు. విల్ స్మిత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. విల్ స్మిత్ ప్రస్తుతం 'కింగ్ రిచర్డ్స్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. విల్ స్మిత్ కు ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడి పద్ధతులు, సంప్రదాయాలు తనకు ఎంతగానో నచ్చుతాయని విల్ స్మిత్ గతంలో తెలిపాడు. స్మిత్ గతంలో ఇండియాకి వచ్చినప్పుడు గంగా హారతి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.

Also Read: Niharika: నేను నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. సమంతని ఉదాహరణగా చెబుతూ నిహారిక కామెంట్స్

Follow Us:
Download App:
  • android
  • ios