Asianet News TeluguAsianet News Telugu

‘హిట్ 2’ ట్రైలర్ సిద్ధం.. డేట్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్ నాని, అడివి శేషు.. ఎప్పుడంటే?

టాలెంటెడ్ హీరో అడివి శేష్ - మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘హిట్ 2’. ఆడియెన్స్ ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ నుంచి బిగ్ ట్రీట్ అందబోతోంది. ఇప్పటికే టీజర్ అందగా..  తాజాగా ట్రైలర్ పై నాని, అడివి శేష్ అప్డేట్ ఇచ్చారు. 
 

Hit2 movie trailer announcement by Naturalstar Nani and Adivi Sesh!
Author
First Published Nov 21, 2022, 6:23 PM IST

నేచరల్ స్టార్ నాని (Nani) సమర్పణ వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘హిట్ : ది సెకండ్ కేస్’ (Hit 2). ఇప్పటికే ‘హిట్’తో ఆడియెన్స్ ను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసిన దర్శకుడు శైలేశ్ కొలను.. సెకండ్ కేసుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అలరించబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతూ వస్తున్నాయి. 

ఇప్పటికే ‘హిట్ 2’ నుంచి వచ్చిన పోస్టర్లు,  టీజర్ కు ఆడియెన్స్ నుంచి భారీ స్పందనే లభించింది. యాక్షన్, క్రైమ్ ను చూపించడంతో పాట.. రొమాంటిక్ యాంగిల్ నూ పరిచయం చేస్తూ ఇటీవల ఓ మెలోడీ ట్రాక్ ను కూడా వదిలారు. తాజాగా అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ ను కూడా విడుదలకు సిద్ధం చేశారు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే దానిపై కొద్దిసేపటి కింద నేచురల్ స్టార్ నాని, హీరో అడివి శేషు కలిసి డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, నాని ట్రైలర్ చూసాడని, అద్భుతంగా ఉందని అంటున్నారు. ట్రైలర్ ను బట్టే సినిమా సూపర్ హిట్ కాబోతుందని రివ్యూ ఇవ్వడం విశేషం. 

వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్  నాని (Nani) సమర్పిస్తున్నారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. నెక్ట్స్ లెవల్ డైరెక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ‘మేజర్’ భారీ సక్సెస్ అందుకున్న అడివి శేషు ‘హిట్ : ది  సెకండ్ కేసు’ను సాల్వ్ చేయబోతుండటంతో  మరింత ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 2న గ్రాండ్ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios