బాలీవుడ్‌  నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు అనేక మలుపులతో సాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకి సుశాంత్‌ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ఎవరైనా హత్య చేశారా? అన్నది పెద్ద సస్పెన్స్ నెలకొంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా ఆరోపిస్తున్నారు. దీనితో ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. సీబీఐ ఎలాంటి నిజాలను వెల్లడిస్తుందనేది ఆసక్తి నెలకొంది.
 
అయినప్పటికీ సుశాంత్‌ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుశాంత్‌ కుటుంబ సభ్యులు కూడా పలు అనుమానాలను సీబీఐ ముందు, బీహార్‌ పోలీసుల ముందు, ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముందు ఉంచారు. శవపరీక్ష విషయంలో పెద్ద డ్రామా జరిగిందని ఆరోపిస్తున్నారు. 

సుశాంత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబయి పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఉరేసుకుంటే కళ్ళు పూర్తిగా తెరిచి ఉండాలి. నాలుక బయటకు రాలేదు. తల వాచినట్టు లేదు. సాధారణంగా ఉంది. దీంతో అసలు భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారా? అనే అనుమానాలను వ్యక్త పరిచారు. తలపై గాయం ఉన్నట్టుగా సుశాంత్‌ ఫోటోలు చూస్తే తెలుస్తుందన్నారు. 

అంతేకాదు శవపరీక్ష చేస్తే తలలో ఏవైనా ఎముకలు విరిగాయా అనే విషయం తెలుస్తుంది. పోస్ట్ మార్టం తర్వాత సుశాంత్‌ తలపై శవపరీక్షలకు సంబంధించిన కుట్లు కనిపించలేదు. అంటే అసలు పోస్ట్ మార్టం చేశారా? ఎందుకంటే ఫోటోల్లో తలని కుట్టినట్టుగా ఎక్కడా కనిపించడం లేదని  కుటుంబ  సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు సుశాంత్‌ది నిజంగా ఆత్మహత్యా? లేక హత్య జరిగిందా? అనేది మిస్టరీగా మారింది. మరి దీనిపై ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌, బీహార్‌ పోలీసులు, సీబీఐ, ముంబయి పోలీసులు ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తి నెలకొంది. 

ఇక జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని బంద్రాలోగల తన అపార్ట్ మెంట్‌లో ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. కానీ సుశాంత్‌ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతుంది. ఆయన కంటే ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజేర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయంతెలిసిందే. ఆమె కేసు కూడా రోజుకో కొత్త మలుపు తిప్పుతూ అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించి సీబీఐ ఎలాంటి నిజాలను వెల్లడిస్తుందో చూడాలి.