అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు గుణశేఖర్.  ఈ మేరకు ఆయన  అఫీషియల్ గా ప్రకటన చేసారు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై పనిచేస్తున్న ఆయన హటాత్తుగా ఇలా ప్రకటన చేయటం వెనక అసలు విషయం ఏమిటనేది చాలా మంది సినిమా వాళ్లను ఆలోచనలో పడేసింది. 

అందుతున్న సమాచారం ఈ చిత్రం నిర్మాణానికి ఆయనకు ఓ కో ప్రొడ్యూసర్ అవసరం అని తెలుస్తోంది. ఫైనాన్స్ చేసేవాళ్లైనా లేదా పెట్టుబడి పెట్టి షేర్ అడిగినా సరే అనే ఆలోచనలో గుణశేఖర్ ఇలా అఫీషియల్ గా ప్రకటించారట. ఇప్పుడు తన సర్కిల్ లో కొందరిని ఆయన కలిసి పెట్టబడి గేదర్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

తన గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై తమిళ, హిందీ భాషల్లో ప్రముఖ నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ‘హిరణ్యకశ్యప’ ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్. 


టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో ఇప్పటికే రానా  ప్రత్యేక కసరత్తు చేస్తున్నారట. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రముఖ వి.ఎఫ్.ఎక్స్ సంస్థలతో గుణశేఖర్ చర్చలు జరిపి అన్ని విధాలుగా రెడీ చేసారట.