ఆర్‌ఎక్స్ 100తో హిట్టందుకున్న కార్తికేయ వెనక దర్శకులు, నిర్మాతలు చాలా మంది పడ్డారు. ఊహించని క్రేజ్ రావడంతో కార్తికేయ కూడా కాస్త కంగారుపడినట్లున్నారు. ఏ డైరక్టర్ తో ముందుకు వెళ్లాలి , ఏ నిర్మాతను ఓకే చేయాలి అని ఓ పెద్ద నిర్మాతతో ముందుకు వెళ్తే అంతా ఆయనే చూసుకుంటాడు. అంతేకాక తమిళంలో కూడా మంచి రిలీజ్ ఉంటుంది అని  తమిళ నిర్మాత కలైపులి థాను నిర్మాణంలో ‘హిప్పీ’ని ప్రకటించాడు. 

కార్తికేయ హీరోగా సినిమా  సహజంగానే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. టైటిల్ వినగా -ఆటిట్యూడ్ బేస్డ్ సినిమా కనుక ఇంట్రస్ట్ రెట్టింపైంది. పబ్లిసిటీలో భాగంగా ‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్’ టాగ్ తగిలించటంతో -అది పీక్స్‌కి చేరింది. కార్తికేయ ‘ప్లేబోయ్’ అప్పియరెన్స్ కూడా ఓ కారణమైంది.  అన్నీ కలిసి విడుదలకు ముందే హిప్పీకి ఇమేజ్ వచ్చేసింది. అయితే కార్తికేయను ఆ రేంజ్‌కి తీసుకెళ్లలేక చతికిలపడింది.తమిళంలోనూ అదే పరిస్దితి. అక్కడా కలెక్షన్స్ లేవు. దర్శక,నిర్మాతలు తమిళం వాళ్లైనా అక్కడా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులో అసలు ఈ సినిమా ఆడుతున్న థియోటర్స్ వైపుకు జనం చూడటం లేదు. ఏసి ఉన్నా కూడా టెమ్ట్ కావటం లేదు.

ఆర్ ఎక్స్ 100 చిత్రం రెండు రోజుల్లో రెండున్నర కోట్లు వసూలు చేస్తే ..హిప్పీ అతి కష్టమీద రెండు రోజులకు 70 లక్షలకు తెచ్చుకుంది. కనీస ఓపినింగ్స్ కూడా ఈ సినిమాకు రాలేదు. సినిమా మొత్తం తన బాడీని చూపెడుతూనే పోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆర్‌ఎక్స్ 100లో విఫల ప్రేమికుడిగా కనిపించిన కార్తికేయ -ప్లే కమ్ లవర్ బోయ్ క్యారెక్టర్‌తో ఓకే అనిపించుకున్నాడు. ‘... తిరిగి ప్రేమిస్తే నరకమే’ అన్న ఎమోషనల్ పెయిన్ చూపించటంలో మాత్రం ఫెయిలయ్యాడు.   స్క్రిప్టు సరిగ్గా చూసుకోకుండా పెద్ద బ్యానర్ కదా అని దూకితే కెరీర్ కష్టాల మయంగా మారిపోతుందనేది కార్తికేయ తెలుసుకోవాల్సిన పాఠంగా ఈ సినిమా మిగిలింది.