స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేశారు.  తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని 

టీవీ మీడియాలో పాపులర్ యాక్ట్రెస్ లలో ఒకరు హీనాఖాన్‌ (Hina Khan). ప్రస్తుతం ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో ( Breast Cancer) బాధ పడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడో స్టేజ్‌లో ఉందని ఆమె ఇన్స్టా గ్రామ్‌ ద్వారా తెలిపారు. టీవీ సీరియల్‌ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో (Seriel actress) ఆమె అభిమానులను సొంతం చేసుకున్నారామె. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

హీనాఖాన్ (hina khan) స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేశారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. 

 "ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉంది. అభిమానులు నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయండి’’ అని పోస్ట్‌ చేశారు. హీనాఖాన్‌ పోస్ట్‌పై తోటి నటులు అభిమానులు స్పందిస్తూ.. మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్ నిక్కీ తంబోలి, నుపుర్‌ సనన, ఏక్త కపూర్‌, మౌనీ రాయ్‌ని ఇలా చాలామంది తారలు హీనాఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఇన్స్టా గ్రామ్‌లో పోస్టులు పెట్టారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని ఈ సందర్భంగా హీనా ఖాన్ చెప్పారు.

ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’లో ఆమె పోషించిన అక్షర పాత్ర ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు పొందింది. అంతే కాకుండా హీనా బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు.