నిర్మాత - శింబు మధ్య వివాదం.. రూ.కోటీ తిరిగివ్వాలని కోర్టు ఆదేశం.! ఇంతకీ ఏం జరిగింది?

రూ.కోటీ తిరిగివ్వాలని మద్రాస్ హైకోర్టు తమిళ స్టార్ శింబును ఆదేశించింది. ఓ నిర్మాతకు ఆయన మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదంపై న్యాయంస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. 
 

High Court Orders Tamil Star Simbhu Returns 1 crore to Producer? NSK

తమిళ స్టార్ హీరో శింబు (Simbu)  ఓ నిర్మాణ సంస్థ మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదంపై తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. సదరు నిర్మాతకు శింబు రూ.కోటీ రూపాయలు తిరిగివ్వాలని తీర్పునిచ్చినట్టు కోలీవుడ్ లో న్యూస్ వైరల్ గా మారింది. కోర్టు ఆదేశంపై శింబు, నిర్మాణ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అసలు నిర్మాతతో శింబుకు వివాదం ఏంటీ? ఎందుకు డబ్బులు తిరిగివ్వాల్సి వస్తోందనేదని ఇలాంటి సమాచారం ఉంది. 

గతంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అనే నిర్మాణ సంస్థతో ఓ సినిమా చేసేందుకు శింబు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సినిమాకు పారితోషికంగా రూ.9.కోట్లు తీసుకుంటానని చెప్పారంట. ఒప్పందం కుదిరాక అడ్వాన్స్డ్ గా రూ.4.5 కోట్లు శింబు అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తంలో కోటీ రూపాయాలు బ్యాంక్ చెల్లింపుల ద్వారా, మిగితా అమౌంట్ ను నగదు రూపంలో తీసుకున్నారని ప్రచారం. కానీ ఆ తర్వాత సినిమా విషయంలో శింబు నిర్మాణసంస్థకు సహకరించలేదని అంటున్నారు. దాంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. 

కొన్నాళ్లు శింబు - నిర్మాత మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెలలో ఈ విషయంపై కోలీవుడ్ నిర్మాతల మండలి కూడా నోటీసులు పంపించినట్టు టాక్. అయినా శింబు స్పందించలేదంట. మొత్తానికి ఈరోజు ఈకేసుపై విచారణ జరిపి బ్యాంక్ ద్వారా తీసుకున్న రూ.కోటీ వెంటనే నిర్మాతకు చెల్లించాలని శింబును ఆదేశించినట్టు తెలుస్తోంది. మిగితా అమౌంట్ విషయంలో సరైన ఆధారాలు లేకపోవడంతో ఇవ్వాల్సిన అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. దీనిపై  శింబు టీమ్ ఎలా స్పందిస్తుందో.. సమస్యను ఎలా సాల్వ్ చేస్తారన్నది చూడాలనంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios