'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై హైకోర్టు విచారణ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 15, Apr 2019, 4:56 PM IST
high court on lakshmies ntr release
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.

దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల తరువాతైనా ఏపీలో సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే అది కూడా జరగలేదు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులు సినిమాను చూసి తీర్పుని సోమవారం నాటికి వాయిదా వేశారు.

ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సిందిగా సూచించింది. దీంతో మరోసారి సినిమా విడుదలపై క్లారిటీ రాకుండా పోయింది.

మరోపక్క ఈ సినిమా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు మోహన్ రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  

loader