Asianet News TeluguAsianet News Telugu

విశ్వంభర సెట్ లో అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్... 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ!

వసిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తుండగా నేడు అధికారికంగా హీరోయిన్ ని పరిచయం చేశారు. చిరంజీవి హీరోయిన్ కి గ్రాండ్ వెల్కం చెప్పారు. 
 

heroine trisha joins chiranjeevi starer vishwambhara sets ksr
Author
First Published Feb 5, 2024, 12:08 PM IST | Last Updated Feb 5, 2024, 12:08 PM IST

చిరంజీవి జోరు మీదున్నారు. వరుస చిత్రాలతో హోరెత్తిస్తున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. వాల్తేరు వీరయ్య అయితే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా విశ్వంభర చిత్ర ప్రకటన చేశారు. చిరంజీవి 156వ చిత్రంగా విశ్వంభర తెరకెక్కుతుంది. 

కాగా విశ్వంభర మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. ఈ మేరకు నేడు అధికారికంగా ఆమెను పరిచయం చేశారు. విశ్వంభర మూవీ సెట్స్ లోకి వెల్కమ్ చెప్పారు. విశ్వంభర చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం కలదట. ఇక 18 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుంది. 2006లో విడుదలైన స్టాలిన్ చిత్రంలో త్రిష-చిరంజీవి జంటగా నటించారు. లాంగ్ గ్యాప్ అనంతరం జతకడుతున్నారు. 

ఇక విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న మూవీ. చిరంజీవి ఈ చిత్రం కోసం మేక్ ఓవర్ కావడం విశేషం. ఆయన జిమ్ లో గంటల తరబడి జిమ్ చేస్తున్నారు. బరువు తగ్గి స్లిమ్ అండ్ ఫిట్ గా తయారు కానున్నారట. విశ్వంభర చిత్రంలో చిరంజీవి లుక్ మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios