Asianet News TeluguAsianet News Telugu

అనిల్ రావిపూడిని మామయ్య అని పిలుస్తున్న శ్రీలీల, అసలు విషయం వెల్లడించిన దర్శకుడు

డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరోయిన్ శ్రీలీల బంధువులని మీకు తెలుసా..? ఇంతకీ వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..? ఈ విషయంలో అనిల్ రావిపూడి ఇచ్చిన క్లారిటీ ఏంటీ..? 

Heroine Sreeleela and Anil Ravipudi Relatives JMS
Author
First Published Oct 17, 2023, 8:00 AM IST

ప్రస్తుతం చేతిలో 10 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె  ముందు వరసలో ఉంది. డిమాండ్ ఉంది కదా అని అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తోంది శ్రీలీల. టాలీవుడ్ లో కృతీ శెట్టిలాంటి హీరోయిన్లకు కూడా పక్కకు నెట్టి దూసుకుపోతోంది బ్యూటీ. 

యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాల ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. నార్త్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమెనుంచి భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాబోతోంది. ఈసినిమాలో ఆమె బాలయ్య బాబుకు కూతురుగా నటించింది. ఈ అయితే ఈమె పాత్రపై ప్రస్తుతం ఇంట్రెస్ట్ క్రిమేట్ అయ్యింది. 

ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు.. యంగ్ స్టార్ హీరోలు కూడా శ్రీలీల  కాల్షీట్లకోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఇక ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే.. ఆమెకు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా వెలుగు వెలగడం ఖాయం.. ఇక ప్రస్తుతం అందరి చూపు భగవంత్ కేసరి సినిమాపైనే ఉంది. ఈక్రమంలో శ్రీలీలకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడికి శ్రీలీల బంధువన్న సంగతి మీకు తెలుసా..? బంధువంటే ఏదో వేలువిడిచిన దూరపు చుట్టరికం కాదట.. శ్రీలీల.. అనిల్ కు చాలా దగ్గర బంధువు అవుతుందట. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా వెల్లడించారు. అనిల్ ను శ్రీలీల ఏమని పిలుస్తుందో తెలుసా.. ఇప్పుడు ఆ న్యూస్ హైలెట్ అవుతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పంగులూరు అని... తన అమ్మమ్మది కూడా అదే ఊరని ఆయన తెలిపారు. శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని అనిల్ చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందని... అయితే బెంగళూరు, అమెరికాలో చదువుకుందని తెలిపారు. 

ఎక్కడికి వెళ్ళినా.. వాళ్ళు ప్రతి ఏటా పంగులూరుకు వస్తుంటారని.. చెప్పారు. అంతే కాదు.. భగవంత్ కేసరి సెట్  లో కూడా అనిల్ ను డైరెక్టర్ గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట.  ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతే కాదు నెటిజన్లు కూడా ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios