హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పారు. సహజమైన  పద్ధతుల్లో కోరుకున్న అందం సాధిస్తున్నట్లు వెల్లడించారు. 

తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేశారు. అక్కడ గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. శోభిత గూఢచారి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ గూఢచారి సూపర్ హిట్ కొట్టింది. కోలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో శోభిత కీలక రోల్ దక్కించుకోవడం విశేషం. శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మాన్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో శోభిత తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే యాంకర్ అడగడంతో సౌందర్యం రహస్యం చెప్పారు. తన మెరిసే చర్మం వెనుక సహజ చిట్కాలు ఉన్నాయన్నారు. శోభిత తన తల్లిగారు సూచనల మేరకు ఆకర్షించే అందం రాబడతున్నారట. శోభిత మాట్లాడుతూ... అప్పుడప్పుడు సెనగ పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ప్రతిరోజూ పండ్ల పిప్పితో ముఖానికి మసాజ్ చేస్తాను. 

స్వచ్ఛమైన కొబ్బరి నూనె పెదాలకు రాసుకుంటాను. పచ్చి పాలతో ముఖం క్లీన్ చేసుకుంటాను. ఆముదంతో కనుబొమ్మలకు బ్రష్ చేస్తాను. ఇవి నా బ్యూటీ టిప్స్. క్రమం తప్పకుండా ఈ పద్ధతులు పాటిస్తూ సౌందర్యం చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నానని శోభిత తెలియజేశారు. 

కాగా శోభిత హీరో నాగ చైతన్యతో ఎఫైర్స్ నడుపుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. కొన్ని నెలల క్రితం వరుస కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య-శోభిత తరచుగా కలుస్తున్నారని. ఆయన కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి శోభితను తీసుకొస్తున్నారని. వీరిద్దరు పెళ్లి ఆలోచనలు చేస్తున్నారని... పుకార్లు వినిపించాయి. నాగ చైతన్య టీమ్, శోభిత ధూళిపాళ్ల ఈ వార్తలను ఖండించారు. చైతు, శోభిత విదేశాల్లో కలిసి తిరుగుతున్నట్లు ఒక ఫోటో తెరపైకి వచ్చింది. అది మార్ఫింగ్ ఫోటో అనే అనుమానాలు ఉన్నాయి.