హీరో నానికి శృతి హాసన్ లవర్ శాంతను హజారిక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. హజారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
హీరోయిన్ శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక డూడుల్ ఆర్టిస్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు. అనూహ్యంగా శాంతను హీరో నానికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు. దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. శాంతను హీరో నాని మీద అభిమానం చాటుకోవడం విశేషంగా మారింది.
కాగా రెండేళ్లకు పైగా శృతి హాసన్-శాంతను హజారిక రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరూ ముంబైలో కలిసి జీవిస్తున్నారు. శృతి హాసన్ తన రిలేషన్ గురించి ఓపెన్ గా చెబుతుంది. హజారికతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు.
దసరా మూవీ నాని హిట్ దాహం తీర్చింది. ఆయనకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ దక్కింది. నైజాం, ఓవర్సీస్ లో దసరా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆంధ్రాలో మాత్రం నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. నానితో కీర్తికి ఇది రెండవ చిత్రం. గతంలో వీరి కాంబోలో నేను లోకల్ తెరకెక్కింది. ఇవి రెండు హిట్ కావడం విశేషం. దీంతో నాని-కీర్తి సురేష్ హిట్ కాంబోగా నిలిచారు.
