సలార్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ నందు శృతి హాసన్ సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రభాస్-ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబినేషన్ తెరకెక్కుతుంది సలార్. కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ ని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నారు. సలార్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఇటీవలే ప్రారంభమైంది. 

సలార్(Salaar) మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. సలార్ మూవీలో తన పాత్ర పేరు ఆద్య, అప్పుడే ఆద్య గురించి ఎక్కువగా చెప్పనని శృతి అన్నారు. ఇక ప్రభాస్ (Prabhas)తో నటించడం అద్భుతం. అలాగే ప్రశాంత్ నీల్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన తన సినిమాలో ఊహాజనిత లోకాన్ని సృష్టిస్తారు. కెజిఎఫ్ చిత్రాలను నాకు ఎంతగానో నచ్చాయని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. 

ఇక శృతి కెరీర్ మెల్లగా ఊపందుకుంటుంది. ఆమె వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. కమ్ బ్యాక్ తర్వాత వకీల్ సాబ్ తో పాటు క్రాక్ చిత్రాల్లో శృతి నటించారు. రవితేజకి జంటగా చేసిన క్రాక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రాక్ మూవీకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఆమెకు బాలయ్య చిత్రంలో అవకాశం ఇచ్చాడు. బాలయ్య 107వ చిత్రంలో శృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బేబీ తెరకెక్కిస్తున్న మెగా 154 మూవీలో చిరంజీవితో శృతి జతకడుతున్నారు. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

ఇక 2019లో లండన్ కి చెందిన మైఖేల్ కొర్ల్సే తో విడిపోయిన శృతి హాసన్, మరొకరితో రిలేషన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శృతి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నారు. ప్రియుడు శాంతనుతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు.