శృతీ హాసన్ ప్రశ్నకు ప్రభాస్ షాక్..కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రెబల్ స్టార్

హీరోయిన్ శృతీ హాసన్ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఒక్క సారిగా తేరుకుని కూల్ గా సమాధానంచెప్పాడు. ఇంతకీ ఆమె ఎమని అడిగిందంటే..? 
 

Heroine Shruti Haasan Different Quastion Prabhas Cool answer Viral JMS


టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా  స్టార్ గా కొనసాగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ప్రభాస్ గురించి, ఆయన సినిమాలు, ఆయన యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే..  ప్రభాస్ మార్కెట్ మాత్రం అమాంతం పెరిగిపోతూనే ఉంది. ప్రభాస్ ను చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఆయన ఎక్కువగా డార్లింగ్ అనే ఊతపదం వాడతారు.. ప్రభాస్ ను కూడా చాలామంది డార్లింగ్ అని పిలుస్తుంటారు. డార్లింగ్ షర్డ్స్ కూడా అపట్లో బాగా ఫేమస్. ఇక ప్రభాస్ ను రెబల్ స్టార్ అని కూడా పిలుస్తారు. టాలీవుడ్ లో ఒక్కొక్క హీరోకు ఒక్కోక్క బిరుదు ఉండగా..ప్రభాస్ కు కూడా యంగ్ రెబల్ స్టార్ అన్న బిరుదు ఉంది. 

ఇక ప్రభాస్ వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. నిరాశలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ కు సలార్ ఊరటనిచ్చింది. పార్ట్ 1 మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమా దాదాజు 700కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఈక్రమంలో ప్రభాస్ అండ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ లుక్ చూసి.. అంతా ముచ్చటపడ్డారు కూడా. ఇక సక్సెస్ మీట్ తో పాటు ఏర్పాటు చేసిన పలు ఇంటర్వ్యూలో ప్రభాస్ కు షాకింగ్ క్వశ్చన్ వేసింది. 

ఈ ఇంటర్వ్యూలో శృతి ప్రభాస్ ను ఉద్దేశించి.. మిమ్మల్ని  రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారని  ప్రశ్నించారు. ప్రభాస్ ఆ ప్రశ్నకు ఒకింత షాక్ అయ్యి.. కూల్ గా ఆన్సర్ ఇచ్చారు. పెదనాన్న రెబల్ స్టార్ కాబట్టి నన్ను రెబల్ స్టార్ అని పిలుస్తారని ఆయన అన్నారు. ఇక శృతి హాసన్ మాట్లాడుతూ ప్రభాస్ ను కలిసిన వారం రోజుల్లోనే ఆయనను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైందని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో  ప్రభాస్, శృతి హాసన్ కాంబినేషన్ లోఇంకా సినిమాలు వస్తే బాగుండు అని కామెంట్లు పెడుతున్నారు. 

ఇక సలార్ పార్ట్ 1 హిట్ అవ్వడంతో వీరి కాంబోలో తెరకెక్కబోతున్న సలార్2 షూట్ గురించి కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్యాన్స్. ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.ప్రభాస్ దృష్టి అంతా సినిమాల మీదే ఉంది. ఆయన చాలా కాలం తరువాత రీసెంట్ గా సలార్ సినిమాతో భారీ హిట్ ను సాధించాడు. వరుస ఫేయిల్యర్స్ నుంచి బయట పడిన ప్రభాస్.. ఇదే సక్సెస్ జోష్ ను కంటీన్యూ చేయాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తో కల్కీ సినిమా చేస్తున్నాడు.. మారుతీతో రాజాసాబ్ పట్టాలెక్కింది.. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios