తెలుగులో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నటి సంగీత. తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ ను క్రియేట్ చేసింది. సంగీత దర్శకుడు క్రిష్ ని పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలం పాటు వైవాహిక జీవితానికి పరిమితమైన సంగీత ఆ తరువాత టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందుతోన్న 'తమిళరసన్' సినిమాలో  సంగీత కీలకపాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. పెళ్లి తరువాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చక సినిమాలు చేయలేదని, అయితే తమిళరసన్ సినిమాలో పాత్ర తనకు నచ్చిందని ఆ కారణంగానే నటిస్తున్నట్లు చెప్పింది. 

సినిమాలో పెద్ద హాస్పిటల్ ని నడిపే ఎండీ పాత్రలో కనిపించనుంది సంగీత. తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇళయరాజా సంగీతం అందిస్తోన్న ఈసినిమాను కౌశల్య రాణి నిర్మిస్తున్నారు.